Sunday, April 3, 2011


ఈ వ్యాపారికి దాహమెక్కువ
===============================

ఒక వైపు ధ్వంసమైన మురికివాడలూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు మునిగిపోతున్న పడవలూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు ఎండిపోతున్న నదులూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు దాహర్తి తో ఉన్న లోకం...ఒక వైపు నువ్వూ.
అయ్యా శభాష్ ! ఏం చెప్పను నీ వైభవం?
నీళ్ళ వ్యాపారివి నువ్వు,
ఆటా నీదే ఆటగాడివీ నువ్వే,
పరచిఉన్న చదరంగం పావులూ నీవే.

నీరంతటినీ పీల్చేస్తున్నావు,
నదులూ సముద్రాలు దోచేస్తున్నావు,
గంగా యమునా గుండెలమీద,
బండరాళ్ళనే బద్దలుచేస్తున్నావు.

అబ్బా !నీ ఈ స్వార్థం
ఎన్నాళ్ళీ నీ దాష్టీకం
ఈ నేల కదిలిన రోజున
నీ తలపొగరంతా దిగిపోదా!

ఇళ్ళూ వాకిళ్ళు కొట్టుకు పోవా
శిధిలాలే ఇక మిగులి పోవా
బొట్టు బొట్టుకీ మొహంవాచి
ఇక ఏంచేస్తావో చెప్పు  వ్యాపారీ !

ఇవాళ పండగ జరుపుకుంటున్నావు
నదులనే దాహానికి గురిచేస్తున్నావు
గంగని బురదగా మరుస్తున్నావు

ఈ భూమి కంపిస్తే ఏంచేస్తావు?
వర్ల్డ్ బ్యాంక్ టోకెన్ పట్టుకు ఏక్కడికెళ్తావు?
ప్రాజెక్టులు వేస్తూ ఏమ్ చేస్తావు?
అప్పుల పాలై దిక్కులు చూస్తావు
ఒకవైపేమో ఎండిన నదులూ...ఒక వైపేమో నువ్వూ.
ఒకవైపేమో దాహార్తితో ఉన్న లోకం...మరోవైపు నువ్వూ !
***********************************************************************************************************************

మూలం : ప్రజాకవి,గిరీష్ చంద్ర తిబాడీ (గిర్దా) హిందీ కవితలు
అనువాదం : ఆర్.శాంతసుందరి




No comments:

Post a Comment