Monday, April 11, 2011


మొక్క మూగదా?                                    
-------------

ఆలోచనల్లో తేలిపోతూ
ఒక రోజు ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు పడుతుంటే
నా కుడి చెవి మీద
పక్కింటి గోడ మీదుగా వాలిన
తీగొకటి తగిలినట్టనిపించింది
ఒక్క క్షణం
దాన్ని తోసెయ్యాలనీ
తుంపి పారెయ్యాలనీ అనిపించింది
కానీ నేనలాటి పనేదీ చెయ్యలేదు,
దాన్ని చేత్తో పట్టుకుని గోడ మీంచి తొంగి చూశాను.
దాని పాదు పూర్తిగా నీళ్ళులేక ఎండిపోయి కనిపించింది...
మౌనంగా ఆ తీగ నాకేం చెప్పాలనుకుందో తెలిసింది,
’నాకు కూడా దాహంగా ఉంది
ఒక బకెట్టు నీళ్ళు నాకు కూడా పొయ్యవా?’
అని అడిగిందది.
’తప్పకుండా,’అన్నాను నాలో నేనే
సందేహం లేదు
మొక్కలకి కూడా భాష ఉంది,
మనలాగే మాట్లడగలవు
అవి మూగవేమీ కావు!

-------------------------------------------------------
ఆంగ్ల మూలం : కుమరేంద్ర మల్లిక్
అనువాదం : ఆర్.శాంత సుందరి

No comments:

Post a Comment